తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే పార్టీని స్థాపించామని వైఎస్ షర్మిల అన్నారు. చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెడతానని వెల్లడిరచారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆమె తొలిసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్‌కు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు అర్ధమే లేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.