Namaste NRI

విశ్వక్‌ సేన్‌ కొత్త చిత్రం ప్రారంభం

విష్వక్‌ సేన్‌, ఐశ్వర్య అర్జున్‌ జంటగా ప్రముఖ నటుడు అర్జున్‌ స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పవన్‌ కల్యాణ్‌ క్లాప్‌ కొట్టారు. ప్రకాశ్‌ రాజ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు స్క్రిప్ట్‌ అందించారు. ఈ సందర్భంగా అర్జున్‌ మాట్లాడుతూ ఇన్నేళ్లుగా నను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా నా కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇదొక ఫీల్‌గుడ్‌ మూవీ, వినూత్న కథతో తెరకెక్కించబోతున్నాం. నా కుమార్తెను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.  ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరిందని హీరో విశ్వక్‌సేన్‌ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.బాలమురుగన్‌, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, సంగీతం: రవి బస్రూర్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: నివేదిత అర్జున్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజ్‌ కమల్‌.కె. ఈ కార్యక్రమంలో సాయిమాధవ్‌ బుర్రా, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, రఫి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events