ప్రపంచంలోనే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత ఇరాన్‌లో నమోదయింది. ఇరాన్‌లోని అబదాన్‌లో జూన్ 21న 52.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని యూఎస్ స్టార్మ్ వాచ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా అబదాన్ రికార్డులోకి ఎక్కింది. అబదాన్ సిటీలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం 70 ఏండ్లలో ఇదే తొలిసారి. ఖుజెస్థాన్‌లో ఎండలు దంచికొడుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కువైట్, ఇరాక్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరాక్‌లో దుమ్ము తుపానులు సంభవిస్తుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.