తుపాకీ సంస్కృతికీ చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో అమెరికా సేనెట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం దక్కింది. గడిచిన 30 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇది చాలా కీలకమైన బిల్లు అని నిపుణులు భావిస్తున్నారు. డెమోక్రాట్లకు తోడుగా 15 మంది రిపబ్లకన్లు జతకట్టడంతో ఆ బిల్లుకు అనుకూలంగా 65 ఓట్లు పోలవ్వగా, 33 మంది వ్యతిరేకించారు. గన్ కంట్రోల్ బిల్లును ఎగువ సభ పెద్దలు ఆమోదించారు. సేనేట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెడుతారు. ఆ తర్వాత అధ్యక్షుడు బైడెన్ సంతకంతో అది చట్టంగా మారుతుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)