సర్కారు వారి పాటతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశీ విహార యాత్రలో ఉన్నారు. మహేష్‌బాబు దంపతులు మైక్రోసాఫ్ట్ అధినేత ఒకరైన బిల్‌గేట్స్‌ని కలిశారు. అమెరికా పర్యటనలో భాగంగా కుటుంబంతో కలిసి న్యూయార్క్ వెళ్లిన మహేష్ బాబు దంపతులు బిల్‌గేట్స్‌ని కలుసుకున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న మహేష్ ప్రపంచ కుబేరుడుతో కలవడం విశేషంగా నిలిచింది. బిల్‌గేట్స్‌ను కలిసిన ఫోటోని ఫ్యాన్స్‌తో పంచుకున్న మహేష్. బిల్‌గేట్స్‌ని కలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో గ్రేటెస్ట్ విజనరీ ఉన్న, అత్యంత గౌరవమైన, ప్రోత్సాహకరమైన వ్యక్తి అంటూ ట్వీట్ చేశారు.