అమెరికాలో ఫుల్‌బాల్‌ను క్యాచ్ పట్టుకోవడంతో ఇద్దరు వ్యక్తులు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. టస్కాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా ఫుట్‌బాల్ స్టేడియం ఈ ఈవెంట్‌కు వేదికైంది. అమెరికా జాతీయ ఫుట్‌బాల్ లీగ్ మాజీ క్రీడాకారుడు, ఆయన కాలేజీ ఫుట్‌బాల్ టీం కోచ్ కలిసి ఈ ఘనత సాధించారు. 2021 ఏప్రిల్ 23న అరిజోనాలో ఈ అరుదైన ఫీట్ జరిగింది. రాబ్ గ్రోంకోవ్‌స్కీ చివరిగా ఒక గ్రేట్ క్యాచ్ చేసి చరిత్ర సృష్టించాలని నిర్ణయించున్నారు. ఫుల్‌బాల్ జట్టు ప్రధాన కోచ్ జెడ్ ఫిష్, మాజీ ఆటగాడు డోనీ సలుమ్, నిర్మాణ సంస్థ లిక్విడ్ లైట్ దీనికి సహకరించారు. హెలికాప్టర్ నుంచి 620 అడుగుల ఎత్తు (188.9 మీటర్లు) నుంచి విసిరిన ఫుట్‌బాల్‌ను రాబ్ గ్రోంకోవ్‌స్కీ తన చేతులతో పట్టుకున్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)