సంతోష్, స్నేహ, మైత్రి నాయకానాయికలుగా నటించిన చిత్రం రుద్ర సింహ. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నటులు సుమన్, భానుచందర్ చిత్ర పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఇదొక విభిన్నమైన యాక్షన్ రివేంజ్ డ్రామా. ఇందులో ఏడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయి. సినిమా చూసి ప్రేక్షకులు కచ్చితంగా భావోద్వేగానికి గురవుతారు. థ్రిల్‌గా ఫీలవుతారు అన్నారు. హీరో సంతోష్ మాట్లాడుతూ మంచి కథతో తెరకెక్కిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ లవ్, యాక్షన్, సెంటిమెంట్‌తో నిండిన చిత్రమిది. మనోహర్ చక్కగా తెరకెక్కించారు. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు. చిన్న చిత్రాలకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు అన్నారు. మనోహర్ కాటేపోగు తెరకెక్కించారు. ధరగయ్య బింగి అంజనేయులు నందవరం, మనోహర్, కోటేశ్వర్ రావు జింకల సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జులై 8న విడుదల కానుంది. కార్యక్రమంలో సముద్ర, రవికుమార్ చౌదరి, శోభారాణి, అఖి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: ప్రేమ్, మణి, సంగీతం: రాజేష్ రాజ్ టి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)