విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా అల్లూరి. కయాదు లోహర్ నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో విష్ణు నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ వర్మ మాట్లాడుతూ నిజాయితీ గల ఒక పోలీస్ అధికారి ఫిక్షనల్ బయోగ్రఫీ ఇది. ఎస్‌ఐగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజు నుంచి సమాజంలో మంచిని కాపాడేందుకు అతను ఎలా ప్రయత్నించాడు? ఈ క్రమంలో ఉన్నతాధికారుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి ఆ పోలీస్ అధికారి ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడు? డిపార్ట్‌మెంట్‌లో అతనెలాంటి మార్పులు తీసుకొచ్చాడు? అనేది సినిమాలో ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నా. కర్తవ్యానికి ప్రాధానత్యనిచ్చే గొప్ప పోలీస్ అధికారులందరికీ ఈ సినిమా ఒక అద్దంలా నిలుస్తుంది అన్నారు. తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రలో నటిస్తున్నారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్వకత్వం వహిస్తున్నారు. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)