సరిహద్దుల వెంట దక్షిణ కొరియా వైపు నుంచి వచ్చిన బెలూన్లు, ఇతర వస్తువుల కారణంగానే తమ దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు. ఈ మేరకు తమ దేశంలో కొవిడ్ వ్యాప్తికి విదేశీ వస్తువులే మూలం అయ్యాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర కొరియా ప్రజల సరిహద్దుల వెంబడి బెలూన్ల ద్వారా పంపే విదేశీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అయితే ఈ రెండు దేశాలలకు చెందిన ప్రజలు సరిహద్దుల వెంట కాస్త పెద్ద బెలూన్లతో కర పత్రాలు, ఇతర సామగ్రిని పంపుకొంటుంటారు. తీవ్ర పేదరికంతో అల్లాడే ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా ప్రజల నుంచి బెలూన్ల ద్వారానే సాయం కూడా అందుతుంటుంది. ఉత్తర కొరియా నుంచి ఏదైనా సమాచారం అందించేవారు ఇలా బెలూన్ల ద్వారా ఇస్తుంటారు.అయితే ఇంతకు ముందు దక్షిణ కొరియా కొంత కాలం ఈ విధానాన్ని నిషేధించింది. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో తిరిగి బెలూన్ల ఎగరవేత కొనసాగుతోంది. దీనిని ఆసరాగా తీసుకునే దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆరోపణలు చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)