గాడ్‌ఫాదర్ రాకకు రంగం సిద్దమైంది. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా గాడ్‌ఫాదర్. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరు 153వ చిత్రంగా వస్తున్న గాడ్ ఫాదర్ నుంచి అదిరిపోయే అప్ డేట్ అందించారు మేకర్స్. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అతిథి పాత్రలో కన్పించనున్నారు. సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు, సంగీతం: తమన్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)