Namaste NRI

సత్యదేవ్‌ బర్త్‌డే స్పెషల్‌ కృష్ణమ్మ ఫస్ట్‌ లుక్‌

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న సినిమా కృష్ణమ్మ. దర్వకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. సత్యదేవ్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో సత్యదేవ్‌ నదీ ఒడ్డున కత్తి పట్టుకొని సీరియస్‌గా చూస్తు నిలబడి ఉన్నాయి. ఇందులో మంచీ చెడుల కలయిక నది నడత. పగ, ప్రేమ కలయిక మనిషి నడక.. ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్నదీ సినిమా. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. సెప్టెంబర్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. లక్ష్మణ్‌, కృష్ణ, అథిరా రాజ్‌, అర్చన, నంద గోపాల్‌, రఘు కుంచే తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి, సంగీతం: కాళ భైరవ. మాటల: సురేష్‌ బాబా, కూర్పు: తమ్మిరాజు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events