భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రస్తుతం అమెరికా పర్యనటలో ఉన్న విషయం తెలిసిందే. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ అధికారిక నివాసంలో కాలిఫోర్నియా తాత్కాలిక గవర్నర్ ఎలిన్ కొనాలకిస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొనాలకిస్‌కు సీజేఐ, ఆయన సతీమణి శివమాల మహాత్మాగాంధీ ఆత్మకథ పుస్తకాన్ని బహూకరించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలని భారత కాన్సుల్ జనరల్ కార్యాలయాన్ని సందర్శించిన కొనాలకిస్ అక్కడే ఉన్న సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణను కలిసినట్లు అధికారులు పేర్కొన్నారు.