సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గార్గి. గౌతమ్ రామ చంద్రన్ దర్శకత్వం వహించారు. కాలి వెంకట్, శరవణన్ కీలక పాత్రధారులు. 2డీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక సమర్పిస్తున్నారు. రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్యర్యా లక్ష్మి, ధామస్ జార్జి, గౌతమ్ రాచంద్రన్ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను నెట్టింట పంచుకున్నారు. కోర్టు డ్రామాగా రూపొందిన చిత్రం గార్గి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 15న విడుదల చేస్తున్నాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాకి 96 ఫేమ్ గోవింద్ వసంత స్వరాలు సమకూర్చారు.
