అమెరికా పౌరసత్వాల్లో భారతీయుల జోరు కొనసాగుతుంది. కొత్తగా పౌరసత్వం పొందినవారు ఎక్కువగా ఉన్న తొలి 5 దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికా అంతర్గత భద్రత విభాగం గణాంకాల ప్రకారం.. మెక్సికో తర్వాత భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. మనవారికి 12,928 మందికి పౌరసత్వం లభించింది. మెక్సికో నుంచి అత్యధికంగా 24,508 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. ఫిలిప్పీన్స్ (11,316), క్యూబా (10,689), డొమినికన్ రిపబ్లిక్ (7,046) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2021లోనూ తొలి త్రైమాసికంలో మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాల్లో మెక్సికో, భారత్‌లు ముందంజలో ఉండగా క్యూబా, ఫిలిప్పీన్స్, చైనాలు తర్వాతి వరుసలో నిలిచాయి. అమెరికాలో అక్టోబర్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఈ మేరకు 2022 ఆర్థిక సంవత్సరంలో జూన్ 15 నాటికి మొత్తం 6,61,500 మంది కొత్తగా పౌరసత్వం పొందినట్లు అమెరికా పౌరసత్వ వలసల సేవా విభాగం (యూఎస్‌సీఐఎస్) తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 8,55,000 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపింది.