అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలోని ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాన్ని అక్రమమైనదంటూ టెక్సాస్‌లోని ఫెడరల్ న్యాయమూర్తి రూలింగ్ ఇచ్చారు. ఎలాంటి పత్రాలు లేని 60వేల మందికి పైగా ఇమిగ్రెంట్లను అమెరికా నుండి అర్థంతరంగా పంపివేయకుండా ఈ విధానం కింద రక్షణ కల్పించారు. ఇందులో వేలాదిమంది భారతీయులు వున్నారు. డ్రీమర్లు (స్వాప్నికులు)గా పేర్కొనే వీరిని రక్షించేందుకు బైడెన్ ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు ఈ రూలింగ్‌తో ఎదురు దెబ్బ తగిలింది. 2012లో ఒబామా ప్రభుత్వ హయాంలో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డిఎసిఎ) కార్యక్రమాన్ని చేపట్టారు. వారిని దేశం నుండి పంపేయకుండా రక్షణ కల్పించారు. మైనర్లుగా దేశంలోకి ప్రవేశించిన వారికి అక్రమ ఇమ్మిగ్రెంట్లుగా వర్క్ పర్మిట్లు ఇచ్చారు. టెక్సాస్‌లో మరో ఆరు రిపబ్లికన్ల ఆధిపత్యం గల రాష్ట్రాలు చేసిన అభ్యర్థనపై అమెరికన్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి ఆండ్రూ హనెస్ ఈ రూలింగ్ ఇచ్చారు.