Namaste NRI

రెండో పిశాచి వస్తోంది

ఆండ్రియా జెర్మియా, విజయ్‌ సేతుపతి, పూర్ణ, సంతోష్‌ ప్రతాప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా పిశాచి 2. ఈ చిత్రానికి మిస్కిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టి.మురుగానందం నిర్మించారు. పిశాచి తొలి చిత్రానికి కొనసాగింపులా కాకుండా అదే తరహా కథాంశంతో పిశాచి2 ని తెరకెక్కించారు మిస్కిన్‌. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి లిరికల్‌ పాట కాలమెంత వేగములే ను విడుదల చేశారు. కార్తీక్‌ రాజా స్వరకల్పనలో సిధ్‌ శ్రీరామ్‌ పాడిన ఈ పాటకు పోతుల రవికిరణ్‌ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తున్నదని చిత్ర బృందం తెలిపారు. ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events