దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం శభాష్ మిథు. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ రూపొందించారు. ఈ సినిమాలో తాప్సీ పన్ను మిథాలీ రాజ్ పాత్రను పోషించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన మిథాలీ రాజ్ వన్డేల్లో 10000 పరుగులకు పైగా చేసింది. ఈ చిత్రంలో ఆమె లెజెండరీ క్రికెటర్‌గా మారే ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను చూపించనున్నాడు దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తాప్సీతో పాటు క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా పాల్గొన్నారు. ఇదివరకే భారత దిగ్గజ క్రికెటర్లతో ఒకరైన సౌరబ్ గంగూలీ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)