ఇండియన్ అమెరికన్, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఈమె జాతి వివక్ష దాడిని ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. సియాటెల్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి ప్రమీలా జయపాల్ ఇంటి వద్దకు చేరుకున్నాడు. అనంతరం అసభ్యపదాలతో ఆమెను దూషించాడు. ఇండియాకు వెళ్లిపో లేదంటే నిన్ను చంపేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా తన వెంట తెచ్చుకున్న తుపాకీతో పలుమార్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన అధికారులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులతో పాటు ఎఫ్‌బీఐ అధికారులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)