శ్రీలంకలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ సూచించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వాటికి అనుగుణంగా ప్రయాణాలు, పనులు చేసుకోవాలని తెలిపింది. అవసరమైతే తమను సంప్రదించాలని సూచించింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, తాజా పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణాలు పెట్టుకోవాలని, దానికి తగినట్లుగానే కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని కొలంబోలోని ఇండియన్ హై కమిషన్ సూచించింది. శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశ నూతన అధ్యక్షుడితో పాటు ప్రధానిని పార్లమెంటు సభ్యులు ఎన్నుకోన్నారు. ఈ నేపథ్యంలో క్తొగా ఎన్నికైన పాలకుల పట్ల ప్రజలు ఏవిధంగా స్పందిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)