ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ భక్తులు అమ్మవారికి బంగారు పాత్రలో బోనం సమర్పించి పూజలు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని శ్రీమహంకాళీ అమ్మవారి ఆలయం నుంచి ఏటా సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా వరుసగా 12వ ఏటా భక్తులు తెలంగాణ నుంచి వెళ్లి బోనాలు సమర్పించగా దుర్గగుడి ఈవో భ్రమరాంబ, పాలకమండలి చైర్మన్ సోమినాయుడు, సభ్యులు పూజలో పాల్గొన్నారు.