కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో భాగంగా అందరినీ కలుస్తాం. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలిస్తాం అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ నివాసానికి వెళ్లారు. దేవేందర్ గౌడ్‌తో పాటు ఆయన కుమారులు వీరేందర్ గౌడ్, విజయేందర్‌గౌడ్‌లతో చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విజయేందర్, వీరేందర్‌లతో చాలా ఆలోచనలు చేశాం. అందరి ఆలోచన ఒక్కటే తెలంగాణ భవిష్యత్తు కోసం పనిచేస్తామన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణను రక్షించుకోవడానికి దేవేందర్ గౌడ్‌లాంటి వారి సేవలు అవసరమన్నారు. వీరేందర్ మాట్లాడుతూ తమ తండ్రి సిద్దాంతాలకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ చేరబోమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, మల్‌రెడ్డి రాంరెడ్డి, దేపభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.