టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను సౌత్ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగారాజు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుటుందన్నారు. ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటే అంత మంత్రి కేటీఆర్ కృషి వల్లే సాద్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కోర్ కమిటీ సభ్యుడు నరేందర్ రెడ్డి మేడసాని, హరీష్ రంగా, గుండా జై విష్ణు, అరవింద్ చీకోటి, వెంకట్ రావు, శ్రీనివాస్ రేపాల, నరేష్ తేజ యాదారి కాశీనాథ్ పాల్గొన్నారు.