ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు మనవరాళ్లు, మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా గాయకులుగా పరిచయం అయ్యారు. జిన్నా కోసం ఆ ఇద్దరు ఓ పాటని ఆలపించారు. ఇదే స్నేహ్నం అంటూ సాగే ఆ పాటకి భాస్కరభట్ల రవికుమార్ సాహిత్య అందించగా, అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. మౌనం కూడా మటాడదా కుహు కుహూ కోయిల పాటవ్వదా అంటూ మొదలయ్యే ఈ పాటతో మంచు కుటుంబం నుంచి మూడోతరం చిత్ర రంగ ప్రవేశం చేసినట్టైందని, పాటకి చక్కటి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు తెలిపాయి. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది. సన్నీలియోన్, పాయల్రాజ్పూత్ కథానాయికలు. అరియానా, వివియానాకు సంగీత ప్రపంచంలోకి స్వాగతం పలుకుతూ ప్రముఖ సంగీత దర్శకులు యం.యం. కీరవాణి, కోటీ, దేవిశ్రీ ప్రసాద్, తమన్ తదితరులు శుభాకాంక్షలందజేశారు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్కీన్ర్ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. జి.నాగేశ్వర రెడ్డి మూలకథనందించారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.