టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను టీఆర్ఎస్ ఖతర్ ఆధ్వర్యంలో దోహలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని కేక్ కట్ చేసి మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. యావత్ భారత్ ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజ విభాగం అధ్యక్షుడు మహేందర్ చింతకుంట, సీనియర్ నాయకులు శంకర్ సుందరగిరి, ఎల్లయ్య తాళ్లపెల్లి, శంకారాచారి బొప్పరపు, భాస్కర్ బత్తిని, నర్సయ్య మీరా, ప్రవీణ్ మోతే, సంజు థామస్, రాజేష్ నేత, రాజి రెడ్డి మాసం తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)