అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ సతీమణితో మస్క్‌కు అఫైర్ ఉందని, అందుకే వీరి స్నేహం చెడిరదని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాన్ తాజాగా స్పందించారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. సెర్గీ సతీమణితో తాను కలలో కూడా అలాంటి ఆలోచన చేయలేదన్నారు. ఇవన్నీ చెత్త కథనాలు. సెర్గీ, నేను మంచి మిత్రులం. నిన్న రాత్రే కలిసి పార్టీ కూడా చేసుకున్నాం. ఈ మూడేళ్లలో నికోల్‌ను రెండుసార్లు మాత్రమే చూశాను. అప్పుడు మా చుట్టూ చాలా మంది ఉన్నారు. రొమాంటిక్‌గా ఏమీ జరగలేదు అని మస్క్ పేర్కొన్నారు. బిలియనీర్ సెర్గీ బ్రిస్ ఆయన భార్య నికోల్ షెనహన్ ఈ ఏడాది జనవరిలో విడాకులకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత విభేదాల కారణంగా గతేడాది డిసెంబరు నుంచి విడివిడిగా ఉంటున్న వారు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మస్క్‌తో నికోల్ బంధమే వీరు విడిపోవడానికి కారణమని ప్రచారం జరిగింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)