భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు స్రెంటల్ హాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ద్రౌపతి ముర్ము కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అంతకుముందు ద్రౌపది ముర్ము ఢల్లీిలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఉరేగింపుతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి పార్లమెంటు సెంట్రల్ హాలుకు చేరుకోగానే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఆమెకు స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ రాజ్యాంగంలోని ఆర్టికల్ `60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఆ వెంటనే సైన్యం 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)