డ్రాగన్ దేశం చైనాకు కౌంటర్‌గా రా వచ్చింది. మారిషస్‌లో అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలపై భారత రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నిఘా అంశం కొత్త మలుపు తిరిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గూఢచర్య కార్యకలాపాలను అడ్డుకొనేందుకే రా ఎంటరైందని వెలుగులోకి వచ్చింది. మారిషస్‌లో చైనా వివాదాస్పద టెక్ కంపెనీ హువావీ ఇంటర్నెట్, సీసీ కెమెరాల నెట్వర్క్ నిర్మిస్తున్నది. దీనిద్వారా పీఎల్ఏ హిందూ సముద్రం ఉట్టూ ఉన్న దేశాలపై నిఘా పెడుతున్నట్టు రా గత ఏడాది మారిషస్, భారత్‌ను హెచ్చరించింది. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌కు 1,120 కిలోమీటర్ల దూరంలోని అగలెగా దీవిలో భారత్ వ్యూహాత్మక అభివృద్ధి చర్యలు చేపట్టింది. ఫ్రాన్స్‌కు చెందిన లా రీయూనియస్ దీవి అక్కడే ఉన్నది. ఈ ప్రాంతాలపై పీఎల్‌పై నిఘా పెడుతున్నట్లు రా గుర్తించిందని తెలిసింది.