Namaste NRI

నేను కేరాఫ్‌ నువ్వు మోషన్‌ పోస్టర్‌ను విడుదల

రతన్‌ కిషోర్‌, సన్య సిన్హా, సత్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా నేను కేరాఫ్‌ నువ్వు.  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర మోషన్‌ పోస్టర్‌ను ఫిలింఛాంబర్‌ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుగు సాగారెడ్డి తుమ్మ మాట్లాడుతూ  వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. 1980లో నేను చూసిన ఇన్సిడెంట్స్‌ స్ఫూర్తిగా కథ రాసుకునన్నాను. కథ, కథనాలు, సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. అన్ని కమర్షియల్‌ అంశాలనూ చిత్రంలో చేర్చాం అన్నారు. ధన, సాగారెడ్డి, గౌతమ్‌ రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాని అగాపే అకాడెమీ పతాకంపై అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్‌ రెడ్డి, కె.జోషెప్‌ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. సాగా రెడ్డి తుమ్ము దర్శకుడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి కృష్ణ ప్రసాద్‌, సంగీతం: ఎన్‌ ఆర్‌ రఘునందన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events