తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఎమర్జన్సీని మరో నెల రోజుల పాటు విక్రమ్ సింఘే ప్రభుత్వం పొడిగించింది. అత్యవసర పరిస్థితి పొడిగించేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ప్రజా భద్రత, నిరాటకంగా నిత్యావసరాల సరఫరా వంటి అంశాలనూ చూపుతూ ఈ నెల 18న దేశంలో ఎమర్జన్సీ విధిస్తూ ఆర్డినెన్స్ రిణిల్ విక్రమ్‌సింఘే తీసుకువచ్చారు. ఆ ఆర్డినెన్స్‌కు 14 రోజుల్లోగా పార్లమెంట్ ఆమోదం తెలపకపోతే అది రద్దు అవుతుంది. కానీ తాజాగా పార్లమెంట్ ఆమోద ముద్ర తెలపకపోతే అది రద్దు అవుతుంది. కానీ తాజా పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్‌లో 120 మంది అనుకూలంగా ఓటు వేశారు. 63 మంది చట్టసభ్యులు వ్యతిరేకించారు. దీనితో మరో నెల రోజుల పాటు దేశంలో అత్యవసర స్థితి అమలులో ఉండనున్నది. ఇది ఇలా ఉండగా, ప్రజాగ్రహంతో దేశ విడిచి సింగపూర్ పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు మరో 14 రోజుల పాటు ఆశ్రయాన్ని అక్కడి ప్రభుత్వం పొడిగించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)