Namaste NRI

ఘనంగా ప్రారంభమైన బిగ్‌ బెన్‌ సినిమా ప్రొడక్షన్‌ నెం.6 సినిమా

చైతన్య రావ్‌, లావణ్య జంటగా బిగ్‌ బెన్‌ సినిమాస్‌ సంస్థ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమాను యష్‌ రంగినేని నిర్మాణంలో దర్శకుడు చెందు ముద్దు రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత సురేష్‌బాబు క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా యష్‌ రంగినేని మాట్లాడుతూ పెళ్లి చూపులు నుంచి మా సంస్థలో కథను నమ్మి సినిమాలు చేస్తు వస్తున్నాం. ఈ చిత్రంలో స్టార్స్‌ లేరు. కథే స్టార్‌. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆగస్ట్‌ 1 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అమలాపురం, అరకు, కేరళ వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ చేయబోతున్నాం. అక్టోబర్‌ కల్లా ఫస్ట్‌ కాపీని సిద్ధం చేయాలని ప్లాన్‌చేస్తున్నాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ అంతా కొత్త వాళ్లం చేస్తున్న ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించాలని భావిస్తున్నాం. లొకేషన్స్‌, మేకింగ్‌ అంతా విభిన్నంగా ఉంటుంది అన్నారు. సంగీత దర్శకుడు ప్రిన్స్‌ హెన్రీ, సినిమాటోగ్రాఫర్‌ పంకజ్‌ తొట్టాడ, మాటల రచయిత లక్ష్మీ  భూపాల్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events