బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీలో తాను వెనుకంజలో ఉన్నట్లు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ, మాజీ మంత్రి రిషి సునక్ అంగీకరించారు. ప్రత్యర్థి టిజ్ ట్రస్ ముందజంలో ఉన్నారన్నారు. అయినా పట్టుదల వీడబోనని, ప్రతి ఓటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిస్తానని ట్రస్ హామీ ఇస్తున్నారు. రిషి మాత్రం దేశంలో ఆర్థిక సంక్షోభానికి తెరపడే దాకా పన్నుల తగ్గింపు సాధ్యం కాదని అంటున్నారు. వ్యక్తిగత పన్నుల్లో కోత విధించబోనని తాను చెప్పడం సార్వజనీనంగా ప్రజల ఆదరణకు నోచుకోలేదని రిషి సునక్ అంగీకరించారు. తన మాటలు తన విజయావకాశాలను ప్రభావితం చేసినప్పటికీ, నిజాయతీగా చేయవలసినది అదేనని ఆయన చెప్పారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)