తన పాదయాత్రలో భాగంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి తన హత్యకు కుట్న పన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ హంతక ముఠాతో సదురు మంత్రి స్కెచ్ వేశారని, ఈ సమాచారం తన వద్ద ఉందన్నారు. గ్యాంగ్‌స్టార్ నయీంకే భయపడలేదని, వీళ్లెంత? అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలకు బెదిరే ప్రసక్తే లేదన్నారు. తాను ఈటల మల్లయ్య కుమారుడినని, ఆత్మగౌరవం కోసం ఎందాకైనా పోరాడుతానని స్పష్టం చేశారు. 2018 లోనే తనను ఓడించడానికి కుట్రలు చేశారని, అయినా ప్రజలు తనకు సంపూర్ణ ఆశీస్సులు అందించారని అన్నారు. ఇప్పుడు కూడా అదే రీతిలో ప్రజలు నిలబడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ప్రజా జీవన యాత్ర’ పేరిట ఈటల రాజేందర్ సోమవారం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రకు అనుమతి తీసుకున్నా, పోలీసులు నిర్బంధాలు సృష్టిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే టీఆర్‌ఎస్ గూండాగిరికి దిగుతోందని మండిపడ్డారు.