Namaste NRI

వింటేజ్ ప్రేమకథ.. ఏయ్‌ పిల్ల

ప్రముఖ హీరో రవితేజ సోదరుడు, నటుడు రఘు తనయుడు మాధవ్‌ భూపతిరాజు హీరోగా పరిచయం కానున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని లుధీర్‌ బైరెడ్డి తెరకెక్కిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. రూబల్‌ షికావత్‌ కథానాయిక. ఈ సినిమాకి ఏయ్‌ పిల్లా అనే  టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 1990 నేపథ్యంలో హృదయానికి హత్తుకునే అందమైన ప్రేమకథా చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుభూతి అందిస్తుంది. 90ల నేపథ్యంలో సాగే  వింటేజ్‌ ప్రేమకథగా ఉంటుంది. సెప్టెంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక  నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం అన్నారు. సంగీతం: మిక్కీ జే.మేయర్‌, సంభాషణలు: అన్వర్‌, కూర్పు: ప్రసన్న, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూర్‌:  గణేష్‌ ముప్పానేని.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events