సెంట్రల్ ఉక్రెయిన్‌లో డ్నిప్రోపెట్రోప్స్క్ ప్రాంతంలో రష్యా జరిపిన దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక గవర్నర్ వాలెంటిన్ రెజ్పిచెంకో తెలిపారు. ఈ భయంకరమైన రాత్రి దాడుల్లో 11 మంది మరణించారని తెలిపారు. ఆ తర్వాత మరికొద్ది సేపటికే మరో ఇద్దరు మృతి చెందారంటూ తెలిపారు. మరో వైపు జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ నుంచి డ్నీపర్ నదికి అవతలి వైపున మార్గానెట్స్‌లో జరిగిన దాడుల్లో 12 మంది మృతి చెందారని ప్రాంతీయ కౌన్సిల్ హెడ్ మైకోలా లుకాషుక్ పేర్కొన్నారు. దాడుల్లో అడ్మినిస్ట్రేటివ్ భవనాలు దెబ్బతిన్నాయని, పాఠశాల, సాంస్కృతిక భవనం, నగర మండలి భవనం దెబ్బతిన్నాయని తెలిపారు. పట్టణంలో విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని, కేవలం మందికి కరెంట్ సదుపాయం లేదని పేర్కొన్నారు.