మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం జిన్నా. సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణుక పాత్రలో సన్నీ కనిపిస్తారు. స్టయిలిష్‌గా ఉన్న రేణుక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తన పాత్ర గురించి సన్నీలియోన్ సామాజిక మాధ్యమాల వేదికగా పలు విషయాల్ని పంచుకుంది. ఊహించని మలుపులతో సాగే ఈ సినిమాలో నటించడం ఓ మంచి అనుభవం అని పేర్కొంది ఆమె. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను రచయిత కోన వెంకట్ అందించారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. నాటు నాటు ఫేమ్ ఫ్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి నృత్యాలు అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఉర్రూతలూగించే సంగీతం అందించగా ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు అని చిత్ర బృందం పేర్కొంది. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. .
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)