సుధీర్ బాబు, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి.మహేంద్ర బాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మించారు. ఇంద్రగంటి గత సినిమాల్లాగే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లో కూడా సంగీతానికి ప్రాధాన్యం ఉంది. వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కొత్త కొత్తగా కి మంచి స్పందన వచ్చింది అని చిత్ర యూనిట్ పేర్కొంది. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, కళ: సాహి సురేష్, కూర్పు : మార్తాండ్ కె.వెంకటేష్.