రష్యాను నాశనం చేయాలనే లక్ష్యంతోనే అమెరికా ఈ ప్లాన్ చేసింది అని చైనా అంబాసిడర్ రaాంగ్ హాన్‌హూయ్ ఆరోపించారు. తైవాన్‌లో అమెరికా స్పీకర్ పెలోసీ పర్యటనను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ జరుగుతున్న పోరు ప్రపంచ శాంతికి చిచ్చుపెట్టిందన్నారు. ఇది రష్యా ఆధిపత్య ధోరణికి నిదర్శనమని పశ్చాత్య దేశాలు వాదిస్తున్నాయని అన్నారు. అయితే ఈ గొడవను ప్రారంభించింది అమెరికానే అని అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ప్రధాన కారణం ఆమెరికానే అని అన్నారు. యుద్ధాన్ని సాగదీసి, ఆంక్షలు విధించడం ద్వారా రష్యాను నాశనం చేయాలని చూసిందని మండిపడ్డారు. ప్రపంచ శాంతికి ప్రధాన నియమం ఒక దేశ అంతర్గత విషయాల్లో మరో దేశం వేలు పెట్టకూడదనేది అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)