పోర్చుగల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోర్చుగల్ విదేశీయులను దేశంలోకి సులభంగా అనుమతించేలా వలసల చట్టానికి ముఖ్యమైన మార్పులు చేసింది. దేశాధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సోసా తాజాగా దీనికి అమోదం తెలిపారు. ఇమిగ్రేషన్ చట్టానికి మార్పులు చేసే బిల్లు జులైలో పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆ తరువాత కొద్ది రోజులకే సభ్యులు మెజారిటీ ఓటుతో వీటికి ఆమోదం తెలిపారు. సోషలిస్ట్, లెఫ్ట్ పార్టీలు కూడా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.త్వరలో ఇది అమల్లోకి రానుంది. కొత్త చట్ట ప్రకారం.. పోర్చుగల్లో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు తాత్కాలిక ప్రాతిపదికన 120 రోజుల కాలపరిమితిగల వీసా జారీ చేస్తారు. అంతేకాకుండా వీసాను మరో 60 రోజులకు పొడిరగే అవకాశం ఉంది.