ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు అతడి సోదరి కిమ్ యో జోంగ్ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీనికి దక్షిణ కొరియా కారణమని ఆరోపించింది. కరోనా వైరస్‌ను కరపత్రాల ద్వారా ఉత్తర కొరియాలోకి ప్రవేశించిందని ఆమె మండిపడిరది. తన సోదరుడు కిమ్ జ్వరం వల్ల తీవ్ర అనారోగ్యం బారిన పడినట్లు చెప్పింది. అయితే ప్రజల కోసం ఆయనకున్న ఆందోళన వల్ల ఒక్క క్షణమైనా బెడ్‌పై విశ్రాంతి తీసుకోలేదని తెలిపింది. మరోసారి దక్షిణ కొరియాకు వార్నింగ్ ఇచ్చింది. ఇది కొనసాగిస్తే వైరస్‌ను మాత్రమే కాకుండా దక్షిణ కొరియా అధికారును కూడా నిర్మూలించేలా మేం ప్రతిస్పందిస్తాం అని హెచ్చరించింది.