శ్రీసింహ కోడూరి కథానాయకుడిగా సతీష్ త్రిపుర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దొంగలున్నారు జాగ్రత్త. ప్రీతి అస్రాని కథానాయిక. సముద్రఖనని ముఖ్య భూమిక పోషించారు. విభిన్నమైన థ్రిల్లర్ కథతో రూపొందుతున్న చిత్రమిది. తెలుగులో ఈ నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రమిదే. దొంగతనం బెడిసి కొట్టిన తర్వాత ఓ దొంగ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందనే విషయాన్ని ఆసక్తికరంగా తెరపై చూపిస్తామని సినీ వర్గాలు తెలిపాయి. అనౌన్స్మెంట్ పోస్టర్లో ఒకవైపు సింహ కోడూరి, మరో వైపు సముద్రఖని ఒకే మొహంగా కనిపించడం ఆసక్తికరంగా వుంది. సింహా కాస్త సీరియస్‌గా కనిపిస్తుండగా సముద్రఖని నుదుటిపై వేళ్లు పట్టుకుని విసుగుచెందినట్లు కనిపించడం క్యూరియా సిటీని పెంచుతోంది. పోస్టర్లో కారును కూడా గమనించవచ్చు. ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించిన మలుపులు తిరుగుతుంది. తర్వాత అతని జీవతం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. డి.సురేష్‌బాబు, సునీత తాటి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: యశ్వంత్.సి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)