ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఖైర్ ఖానా మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. దీంతో సమీదు ఇమామ్ సహా 20 మంది మరణించారు. కనీసం 40 మంది తీవ్రగా గాయపడ్డారు. వీరిలో కొందమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అక్కడ ఒక్కసారిగా భారీ పేలుడు శబ్ధం వినిపించిందని, పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనాల కిటికీలు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కాబూల్ పోలీస్ అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. ఇప్పటి వరకు పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ప్రకటించలేదని వెల్లడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)