ఐక్యరాజ్య సమితి (ఐరాస) సరికొత్త ఇంటర్నెట్ పాలన వేదిక (ఐజీఎఫ్) నాయకత్వ బృందానికి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ 10 మంది సభ్యులను నియమించారు. వీరిలో భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అల్కేశ్ కుమార్ శర్మ కూడా ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యుల్లో ఐరాస సెక్రటరీ జనరల్‌కు టెక్నాలజీ ప్రతినిధి అయిన అమన్‌దీప్ సింగ్ గిల్ కూడా ఉన్నారు. ఐజీఎఫ్ చర్చలను సిఫార్సులను ప్రపంచ దేశాలకు అందజేసి కార్యోన్ముఖం చేయడం నాయకత్వ బృందం బాధ్యత. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను ఐజీఎఫ్ నాయకత్వ బృందంలో సభ్యులుగా నియమించారు.