Namaste NRI

సెప్టెంబర్‌ 2న నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా

తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్‌ వందెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నా వెంటపడుతున్న చిన్నవాడెవడమ్మా.  ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందించిన చిత్రమిది. మంచి కాన్సెప్ట్‌తో సగటు చిత్రాలకి భిన్నంగా సాగుతుంది. అందరికీ కనెక్ట్‌ అయ్యే భావోద్వేగాలు ఉంటాయి అన్నారు. అనంతరం నిర్మాత ముల్లేటి నాగేశ్వర రావు మాట్లాడుతూ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమా స్వచ్ఛమైన వినోదాన్ని పంచుతుందన్నారు. త్వరలో ట్రైటర్‌ కూడా రిలీజ్‌ చేయబోతున్నాము. మంచి కన్సెప్ట్‌తో వస్తున్న మా చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, కల్పనారెడ్డి, జీవా, జోగి బ్రదర్స్‌ తదితరులు నటించారు. ముల్లేటి కమలాక్షి, గుబ్బుల వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాణ వర్గాలు వెల్లడిరచాయి. ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ కుమార్‌,  ఛాయాగ్రహణం : పి.వంశీ ప్రకాశ్‌,

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events