కమల్‌హాసన్ శంకర్ కలయికలో రూపొందుతున్న భారీ ప్రాజెక్టు భారతీయుడు 2. 1996లో ఈ ఇద్దరి కలయికలోనే వచ్చిన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వివిధ కారణాలతో 2020లో ఆగిపోయిన భారతీయుడు 2 సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. చెన్నైలోని పర్రీస్ కార్నర్‌కు సమీపంలో వేసిన భారీ సెట్టులో షూటింగ్ జరుగనుందని కోలీవుడ్ సర్కిల్ టాక్. లీడ్ యాక్టర్లు కాజల్ అగర్వాల్, బాబీ సింహాపై వచ్చే సీన్లను చిత్రీకరించనున్నారట. వీరితో పాటు సిద్దార్థ్ కూడా సెట్స్‌లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 5 నుంచి కమల్ హాసన్ షూట్‌లో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్` సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. తాజా లుక్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)