అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ మరోసారి కరోనా బారినపడ్డారు. ఆమె కొవిడ్ టెస్టులు చేయించుకోగా పాజిటివ్ తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వైట్‌హౌస్ తెలిపింది. జిల్ బైడెన్‌కు సన్నిహితంగా ఉన్నందున అధ్యక్షుడు జో బైడెన్ సైతం అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాల మేరకు పది రోజుల పాటు ఇంట్లోనే ఉండి మాస్క్ ధరిస్తారని పేర్కొన్నారు. ఇంతకు ముందు జో బైడెన్ సైతం రెండుసార్లు కరోనా పాజిటివ్‌గా తేలింది. అధ్యక్ష భాద్యతలు స్వీకరించడానికి ముందే ఫైజర్ కొవిడ్ టీకాను వేసుకున్నారు.