అతి చిన్న వయసులో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టివచ్చిన వ్యక్తిగా బల్గేరియాకు చెందిన పైలట్ మాక్ రూథర్‌ఫర్డ్ (17) రికార్డు సృష్టించాడు. రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను గురిపెట్టిన అతను 5 నెలల క్రితం సోఫియా నుంచి ఓ ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. తిరిగి ఇక్కడికే చేరుకున్నాడు. బల్గేరియన్` బ్రిటిష్ జాతీయుడైన మాక్ ఓ బుల్లి విమానంలో ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. మార్చి 23న ప్రపంచ పర్యటనకు బయల్దేరిన మాక్ 5 ఖండాల్లోని 52 దేశాలను చుట్టివచ్చాడు. 2020లో అతను ఫైలట్ లైసెన్స్‌కు అర్హత పొంది అతి చిన్న (15 ఏళ్లకు) వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. మాక్ ప్రయాణించిన బుల్లి విమానంలో సాధారణంగా 2 సీట్లే ఉంటాయి. అయితే అతను తన ప్రయాణానికి అనుగుణంగా దీనికి మార్పులు చేశాడు. రెండో సీటును తొలగించి ఆ స్థానంలో అదనపు ఇంధన ట్యాంకునే ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతవరకు బ్రిటన్‌కు చెందిన ట్రావిస్ లుడ్లో (18) పేరిట ఉన్న రికార్డును బద్ధలుగొట్టాడు.