Namaste NRI

కళాపురం ప్రీ రిలీజ్‌ వేడుక

సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను, రక్షిత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కళాపురం. ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యం రాజేష్‌ మాట్లాడుతూ నా కెరీర్‌లో ఈ సినిమాకు ఎంతో  ప్రత్యేకత ఉంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ పాండమిక్‌ టైమ్‌లో ఈ సినిమా మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేశాం. ఈ సినిమా కథకు సత్యం రాజేష్‌ చక్కగా సరిపోయాడు. మణిశర్మ అద్భుతమైన రీకార్డింగ్‌ ఇచ్చారు. సాంకేతికంగా కూడా ఉన్నతంగా ఉంటుందీ చిత్రం. కామెడీ డ్రామాగా అలరిస్తుంది. ఆరోగ్యకరమై హాస్యంతో మెప్పిస్తుంది అన్నారు. ఈ చిత్రానికి కరుణ కుమార్‌ దర్శకుడు. జీ స్టూడియోస్‌, ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మించారు. ఈ సినిమా 26న విడుదల కానుంది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events