హెబ్బా పటేల్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం గీతా. మ్యూట్ విట్నెస్ అన్నది ఉపశీర్షిక. సునీల్ ముఖ్యభూమిక పోషించారు. విశ్వ దర్శకత్వం వహించారు. ఆర్.రాచయ్య నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆడియో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ గీతా అనే అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు, వాటి నుంచి ఆమె ఎలా బయటపడిరదన్నది ఆసక్తిని పంచుతుంది. కథలోని కొత్తదనం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని చెప్పారు. ఓ విభిన్న కాన్సెప్ట్‌తో చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని హెబ్బాపటేల్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులు పి.రామసుబ్బారెడ్డి, పి.గిరిధర్‌రెడ్డి, మల్లిడి సత్యనారాయణ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సతీస్ కుమార్, డైమండ్ రత్నబాబు, విజయ్, ఛాయాగ్రాహకుడు క్రాంతికుమార్, సంగీత దర్శకుడు సుభాస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.