అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న డెల్లాస్‌లో భారతీయ మహిళలపై జాతివివక్ష దాడి జరిగింది. మెక్సికన్‌కు చెందిన మహిళ ఓ పార్కింక్ లాట్‌లో భారతీయ మహిళలపై అటాక్ చేసింది. ఇండియాకు వెళ్లిపోవాలంటూ భారతీయ మహిళల్ని తిట్టింది. ఇండియన్లను ద్వేషిస్తాని, బెటర్ లైఫ్ కోసమే భారతీయులు అమెరికా వస్తుంటారని ఆమె అన్నది. నేను ఎక్కడకు వెళ్లినా అక్కడ ఇండియన్లు కనిపిస్తుంటారని, ఒకవేళ ఇండియాలో లైఫ్ బాగా ఉంటే అప్పుడు మీరు ఇక్కడకి ఎందుకు వచ్చినట్లు అని ఆమె అరించింది. భారతీయులపై చేయి చేసుకున్న ఆ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మెక్సికన్ మహిళను ఎస్మరాల్డో ఉప్టన్‌గా గుర్తించారు. దాడికి సంబంధించిన వీడియో అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీలో వైరల్ అయ్యింది.