కరోనా నేపథ్యంలో అమెరికా విమానాలను ఇటీవల చైనా రద్దు చేసింది. అయితే చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ అమెరికా కూడా చర్యలు చేపట్టింది.చైనాకు చెందిన 26 విమానాలను సస్పెండ్ చేస్తున్నట్లు అమెరికా వెల్లడిరచింది. జియామిన్, ఎయిర్ చైనా, చైనా సదరన్, ఎయిర్లైన్స్, చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్ సంస్థలకు చెందిన విమానాలను సెప్టెంబర్ 5 నుంచి 28 తేదీ వరకు రద్దు చేశారు. లాస్ ఏంజిల్స్ నుంచి వెళ్లే 19 విమానాలను, న్యూయార్క్ నుంచి ఏడు విమానాలను రద్దు చేయనున్నారు. అకారణంగా అమెరికా తమ విమానాలను రద్దు చేసినట్లు చైనా ఎంబసీ ప్రతినిధి లియూ పెంగ్యూ తెలిపారు.